Abn logo
Jan 12 2021 @ 18:39PM

పేరు మార్చుకున్న ప్రైమ్ వీడియో?.. ఇదేం నిర్ణయం?

ఇంటర్నెట్ డెస్క్: ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీసులు అందించిన అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏపీవీ) తన పేరు మార్చుకుంది. 'Prime Video'లో 'ME' అక్షరాలను తొలగించింది. సోషల్ మీడియాలో ఈ సంస్థకు చెందినా ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ మార్పు చేసింది. అలాగే ఈ మార్పును ప్రస్తావిస్తూ #WhereIsME అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేసింది ఏవీపీ సంస్థ. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దీన్ని ట్రెండ్ చేసింది. హిట్ సినిమాల్లోని కొన్ని డైలాగులను తీసుకొని వాటిలో కూడా 'ఎమ్‌ఈ' కనిపించకుండా ఎడిట్ చేసి పోస్టులు పెట్టింది. ఈ కంపెనీ ఇలా ఎందుకు చేసిందో తెలియదుగానీ, దీన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ మాత్రం అసలేమయిందో తెలియక తికమక పడిపోతున్నారు. నిజంగానే ‘ఎమ్‌ఈ’ ఏమయ్యాయి? అని ప్రశ్నిస్తున్నారు. ఇక నుంచి ఈ రెండు అక్షరాలూ ప్రైమ్ వీడియోలో ఉండవా? అని అడుగుతున్నారు. మరి దీనికి అమెజాన్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే.


డైలాగ్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement
Advertisement