వందశాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు

ABN , First Publish Date - 2021-04-21T06:27:20+05:30 IST

జిల్లాలోని అన్ని కేంద్రాల్లో 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వంద శాతం వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు.

వందశాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు
వీర్నపల్లిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి

- జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 20: జిల్లాలోని అన్ని కేంద్రాల్లో 45 ఏళ్ల  వయస్సు పైబడిన వారికి వంద శాతం వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, రాజన్నపేట, అగ్రహారం గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, గొల్లపల్లి, రాజన్నపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా పంపిణీ తీరును పరీశించారు. ప్రజలు టీకాపై అపోహలకు తావ్వికూడదన్నారు. ముందుకు వచ్చి వేసుకోవాలన్నారు. అగ్రహారంలో కొవిడ్‌ బాధితుల ఇళ్లను సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. మాస్కులు ధరిం చి భౌతిక దూరం పాటించాలని  సూచించారు.  వైద్యాధికారులు ధర్మానాయక్‌, మానస ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట:  మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మాత్రమే వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు   వైద్యాధికారి ధర్మానాయక్‌  తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకా పంపిణీ, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొవిడ్‌ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

వీర్నపల్లి: ప్రభుత్వం ప్రకటించిన విధంగా 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ  కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం అత్యావశ్యకమని  జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు అన్నారు.  మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు మద్దిమల్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను   పరిశీలించారు.  వ్యాక్సిన్‌పై స్థానికులకు అవగాహ న కల్పించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని  సూచించారు.   లక్షణా లు ఉంటే వెంటనే  కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలన్నారు.   డాక్టర్‌ ధర్మానాయక్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ బాబు, ఏఎన్‌ఎంల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:27:20+05:30 IST