తీరంలో పరిశుభ్రతకు చర్యలు

ABN , First Publish Date - 2020-09-19T09:19:37+05:30 IST

తీర ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఐయామ్‌ సేవింగ్‌ మై బీచ్‌ నినాదంతో

తీరంలో పరిశుభ్రతకు చర్యలు

ఐయామ్‌ సేవింగ్‌ మై బీచ్‌ నినాదంతో రుషికొండలో  జెండా ఆవిష్కరించిన కలెక్టర్‌ 


ఎండాడ, సెప్టెంబరు 18: తీర ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు  కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఐయామ్‌ సేవింగ్‌ మై బీచ్‌ నినాదంతో రుషికొండ బీచ్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ జెండాను ఆవిష్కరించారు. కేంద్రం ఇటీవల రుషికొండ బీచ్‌ను బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తీరంలో స్వచ్ఛతను  మెరుగుపరిచేందు కు ప్రపంచ బ్యాంకు నిధులతో ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను కేంద్రం ప్రారంభించింది.


ఈ మేరకు శుక్రవారం అన్ని బీచ్‌లలో జెండా ఎగురవేయాలని కేంద్ర పర్యావరణ శాఖ వెబ్‌ సందేశాన్ని పంపింది. ఇందులో భాగంగా రుషికొండ బీచ్‌ను పరిశీలించేందుకు ఇండిపెండెంట్‌ నేషనల్‌ జ్యూరీకి చెందిన పర్యావరణవేత్తలు, శాస్తవేత్తలు వచ్చే అవకాశమున్న నేపఽథ్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ సృజన, జిల్లా టూరిజం అధికారి ఆర్‌.పూర్ణిమాదేవి, రీజనల్‌ టూరిజం ఆఫీసర్‌ ఏవీ రామప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-19T09:19:37+05:30 IST