‘అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు’

ABN , First Publish Date - 2020-07-08T10:40:02+05:30 IST

జిల్లాలో అక్రమంగా మద్యం, ఇసుక, నాటుసారా రవాణా చేస్తే పోలీసు చర్యలు తప్పవని జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, అదనపు ఎస్పీ

‘అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు’

చాగలమర్రి, జూలై 7: జిల్లాలో అక్రమంగా మద్యం, ఇసుక, నాటుసారా రవాణా చేస్తే పోలీసు చర్యలు తప్పవని జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, అదనపు ఎస్పీ గౌతమిశాలి అన్నారు. మంగళవారం చాగలమర్రి పోలీసు స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆళ్లగడ్డ సీఐ సుదర్శన్‌ప్రసాద్‌, ఎస్‌ఐ పీరయ్యలతో అక్రమ మద్యం, ఇసుక తరలింపు గురించి చర్చించారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, ఇసుక రవాణాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. 

Updated Date - 2020-07-08T10:40:02+05:30 IST