కరోనా చికిత్సకు వైద్యుల నియామకానికి చర్యలు

ABN , First Publish Date - 2020-03-30T10:34:51+05:30 IST

జిల్లావ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యనిపుణులను

కరోనా చికిత్సకు వైద్యుల నియామకానికి చర్యలు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 29: జిల్లావ్యాప్తంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యనిపుణులను నియమించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాగోలులోని జెమ్స్‌ని జిల్లా కోవిడ్‌-19 ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోయినా, అవసరమైతే అత్యవసర చికిత్సను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని విభాగాల్లో ఇంకా కొంతమంది వైద్యులు అవసరమున్నట్లు గుర్తించాం.


ఈ ఖాళీల్లో వైద్యవిద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారిని నియమిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లిస్తాం. జిల్లా కోవిడ్‌ ఆసుపత్రికి ఎనస్తీషియా, పల్మనాలజిస్ట్‌, ఫిజీషియన్లు, ఎనస్తీషియా టెక్నీషియన్లు, ఎఫ్‌ఎన్‌ఓలు (ఫిమేల్‌ నర్స్‌ ఆర్డర్లీ), ఎంఎన్‌ఓ (మేల్‌ నర్స్‌ ఆర్డరీ)లను నియామకానికి చర్యలు చేపట్టా’మని ఆయన వివరించారు. ఆసక్తి గల వైద్యులు, విశ్రాంత వైద్యులు 94942 16016 ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-03-30T10:34:51+05:30 IST