అటవీ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-09-17T05:19:21+05:30 IST

అట వీ ప్రాంత అభివృద్ధికి చర్య లు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నా రు.

అటవీ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలి : కలెక్టర్‌
సిద్దవటం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న కలెక్టర్‌

సిద్దవటం, సెప్టెంబరు 16: అట వీ ప్రాంత అభివృద్ధికి చర్య లు చేపట్టాలని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నా రు. సిద్దవటం మండలంలోని షాప్‌బాయ్‌ అటవీ ప్రాం  తాన్ని గురువారం డీఎఫ్‌వో రవీంద్రరామతో కలసి సందర్శించారు. ఈసందర్భంగా ఆ ప్రాంతం బేస్‌ క్యాంప్‌ వద్ద మొక్కలు నాటారు. అనంత రం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. మానవాళి మనుగడకు పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో ఉయోగపడతాయన్నారు. అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను పరిశీలించి ఆ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి బట్టఘనగుంట వద్ద టవర్‌పైకి ఎక్కి అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. పక్షులు, జంతువులు వివిధ రకాల వన్యప్రాణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌తో కలసి సిద్దవటం కోటను సందర్శించారు. కార్యక్రమంలో సిద్దవటం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ పరుశురాముడు, బీట్‌ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది, ప్రొటక్షన్‌ వాచర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-17T05:19:21+05:30 IST