రోడ్డుప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-09-17T10:44:19+05:30 IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జీ సీపీ కమలాసన్‌ రెడ్డి అన్నారు

రోడ్డుప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

నేర సమీక్షలో జిల్లా ఇన్‌చార్జి సీపీ కమలాసన్‌ రెడ్డి


జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 16: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జీ సీపీ కమలాసన్‌ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక వీకేబీ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా పోలీస్‌ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలు, వాటిపురోగాభివృద్ది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను త్వరితగతిన పరిష్కరించాలని  సూచించారు. ఆన్‌లైన్‌ కేసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు.


అలాగే డయల్‌ 100 కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలనీ, దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్‌ వ్యవస్థను నిఘా వ్యవస్థను పటిష్ట పర్చాలనీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నిర్వహనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీ వెంకట రమణ, గౌస్‌ బాబా,  డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్‌ రాఘవేంద్రరావు, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌, ఏవో చంద్రకాంత్‌ తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-17T10:44:19+05:30 IST