కత్తెర పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-23T05:43:40+05:30 IST

ఏజెన్సీ వ్యాప్తంగా సాగులోనున్న మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు ఆశించిందని, రైతులు నివారణ చర్యలు ప్రారంభించాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ దేశగిరి శేఖర్‌ అన్నారు.

కత్తెర పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలి
మొక్కజొన్న మొక్కలను పరిశీలిస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శేఖర్‌


ఆర్‌ఏఆర్‌ఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శేఖర్‌

చింతపల్లి, జూన్‌ 22: ఏజెన్సీ వ్యాప్తంగా సాగులోనున్న మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు ఆశించిందని, రైతులు నివారణ చర్యలు ప్రారంభించాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ దేశగిరి శేఖర్‌ అన్నారు. మంగళవారం  అన్నవరం పంచాయతీ కుర్మన్నపాకలు గ్రామంలో రైతులు సాగుచేస్తున్న మొక్కజొన్న పంటను సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత్త రైతులతో మాట్లాడుతూ, మొక్కజొన్నలో కత్తెరపురుగు ఆశించిందన్నారు. పంటలో ఈ పురుగుల ఉధృతి పది శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఎకరానికి ఎమామేక్టిన్‌ బెంజోయేట్‌-5ఎస్‌జీ 80గ్రాములు మొక్క మొవ్వులో పడేటట్టు సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలన్నారు. పంటలో ఐదు శాతం నష్టపోయిన మొక్కలను గమనించి వెంటనే ఐదు శాతం వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం శాస్త్రవేత్తలనుగాని, వ్యవసాయ అధికారులనుగాని సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-06-23T05:43:40+05:30 IST