తమిళనాట లైంగిక వేధింపుల అడ్డుకట్టకు చర్యలు

ABN , First Publish Date - 2021-06-23T10:05:29+05:30 IST

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థినులపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తమిళనాట లైంగిక వేధింపుల అడ్డుకట్టకు చర్యలు

ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలు.. ప్రభుత్వం ఆదేశం


చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో విద్యార్థినులపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, విద్యార్థినుల రక్షణ కోసం ఒక అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు అదే పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అసోసియేషన్‌ నుంచి ఇద్దరు, పాఠశాల మేనేజ్‌మెంట్‌ నుంచి ఒకరు, బోధనేతర సిబ్బంది ఒకరు సభ్యులుగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా నెల రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోల్‌ రూంను రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతి ఏడాది నవంబరు 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థుల భద్రతా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2021-06-23T10:05:29+05:30 IST