హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2021-10-14T05:03:14+05:30 IST

జిల్లాలో జాతీయ రహదారిపై(హైవే) ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదే శించారు.

హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు
ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అమిత్‌బర్దర్‌

 ఎస్పీ అమిత్‌బర్దర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : జిల్లాలో జాతీయ రహదారిపై(హైవే)  ప్రమాదాల నివారణకు  చర్యలు చేపట్టాలని  ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదే శించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో హైవేపై ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై పోలీసు, రవాణా అధికారులు, ఎన్‌హెచ్‌ఏఐ  ప్రతినిధులతో సమీక్షించారు.  హైవేపై ప్రమా దాలు జరిగితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతోపాటు సమస్యలు ఉత్ప న్నమైతే  సమాచా రాన్ని 6309990844 ఫోన్‌నంబర్‌కు తెలియజేయాలని   కోరారు.  సమావేశంలో డీఎస్పీలు మహేంద్ర, ప్రసాదరావు, శివరామిరెడ్డి, ఎంవీఐ దుర్గాప్రసాద్‌, హైవే, ఆప్కో సంస్థల ప్రతినిధులు నాగేంద్రశర్మ, శ్రీకాంత్‌, రంజిత్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి

సమస్యల పరిష్కారం కోసం వచ్చే బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలని   ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశించారు. బుధవారం  శ్రీకాకుళంలోని  ఫ్యామిలీ పోలీసు కేంద్రాన్ని  తనిఖీచేశారు.ఈ సందర్భంగా బాధితులతో ఎస్పీ మాట్లాడారు. భార్యాభర్తలు చిన్నచిన్న వివాదాల్లో పట్టింపులకు వెళ్లి  జీవితాన్నే నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లల భవిష్యత్‌పై ఆలోచించాలని   తెలిపారు.ఆయన వెంట దిశ డీఎస్పీ వాసుదేవ్‌, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రం సభ్యులు పి రాజేశ్వరరావు ఉన్నారు.  


Updated Date - 2021-10-14T05:03:14+05:30 IST