రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2022-01-19T05:35:24+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

 వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి

నల్లగొండ క్రైం, జనవరి 18: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లా పోలీస్‌ అధికారులతోపాటు జాతీయ రహదారుల అథారిటీ, వివిధ ప్రభుత్వ శాఖలు, జీఎమ్మార్‌, రహదారుల నిర్వహణ సంస్థల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులపై రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 20 కన్నా అధికంగా మరణాలు చోటుచేసుకున్న 48 ప్రాంతాలను గుర్తించామని, ఆయా పోలీ్‌సస్టేషన్ల పరిధిలోని బ్లాక్‌స్పాట్లలో ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లను ఇంజనీరింగ్‌ నిపుణుల సలహాలతోపాటు స్టాపర్లు, జంక్షన్‌ బాక్సులు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 31వతేదీ వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అవసరమై న అన్ని రకాల చర్యలను పూర్తి చేయనున్నట్లు వివరించారు. డీటీసీ ఎస్పీ సతీ ష్‌ చోడగిరి మాట్లాడుతూ చిట్యాల పట్టణంలోని బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారి వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డీటీఆర్‌బీ అధికారి అంజయ్య, అధికారులు పాల్గొన్నారు. 


పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : ఎస్పీ

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పోలీ్‌సస్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 17రకాల ఫంక్షనల్‌ వర్టికల్స్‌ తీరు సమర్ధవంతంగా ఉండాలన్నారు. కేసుల విచారణలో సాంకేతిక ఆధారాలు కీలకమని, సీసీ కెమెరాల ఫుటేజీలు, ఫోన్‌కాల్స్‌లాంటి ఆధారాల ద్వారా త్వరగా పరిష్కారమవుతాయన్నారు. విచారణ అధికారులు సాంకేతిక ఆధారాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రతీ పోలీస్‌ అధికారి సమర్థంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీష్‌ చోడగిరి, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రమణారెడ్డి, సీఐలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:35:24+05:30 IST