‘ఉపాధి’ కూలీలకు ఎండ నుంచి ఉపశమనానికి చర్యలు

ABN , First Publish Date - 2020-02-23T05:59:54+05:30 IST

ఉపాధి హామీ పథకంలో 2019-20కు సంబంధించి పనిచేసే పాంతంలో వేసవిలో కూలీల ఉపశమనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపడుతున్నామని డ్వామా పీడీ

‘ఉపాధి’ కూలీలకు ఎండ నుంచి ఉపశమనానికి చర్యలు

డ్వామా పీడీ జ్యోతిబసు


నెల్లూరు (జడ్పీ), ఫిబ్రవరి 22 : ఉపాధి హామీ పథకంలో 2019-20కు సంబంధించి పనిచేసే పాంతంలో వేసవిలో కూలీల ఉపశమనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపడుతున్నామని డ్వామా పీడీ జ్యోతిబసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో మధ్మాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పని చేయడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో తాగునీటి ఏర్పాటుకు రోజుకు రూ. 5 అదనంగా ఇస్తున్నామని,. కూలీలకు వేసవిలో  ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం, మే, జూన్‌లలో 20 శాతం అదనంగా ఇస్తారని తెలిపారు. పని ప్రదేశాల్లో చిన్న పిల్లల రక్షణ కోసం ఆయాను ఏర్పాటు చేసుకోవచ్చని, జిల్లా వైద్య శాఖ సహకారంతో వోఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎండ సమయంలో సేద తీరేందుకు పని ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాటు చేస్తారని, కూలీలు వడదెబ్బకు గురైతే వెంటనే ప్రఽథమ చికిత్స చేయిస్తారని పేర్కొన్నారు. ఉపాధి హామీకి సంబంధించి 2019-20 ఏడాదికి సిమెంటు ధరను బోర్డు ఆఫ్‌ చీఫ్‌ ఇంజనీరు ఖరారు చేశారని ఆయన తెలిపారు. .

Updated Date - 2020-02-23T05:59:54+05:30 IST