భవన నిర్మాణాల వేగవంతానికి చర్యలు

ABN , First Publish Date - 2021-06-18T05:11:59+05:30 IST

ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని డ్వామా పీడీ అయితా నాగేశ్వరరావు, డీపీవో సుభాషిణి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.

భవన నిర్మాణాల వేగవంతానికి చర్యలు
తెర్లాం మండలంలో భవన నిర్మాణాలను పరిశీలిస్తున్న డీపీవో తదితరులు

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూన్‌ 17:  ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని  డ్వామా పీడీ అయితా నాగేశ్వరరావు, డీపీవో సుభాషిణి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.    భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా  ఆర్‌బీకే, అంగన్‌వాడీ, వెల్నెస్‌ , సచివాలయాల భవన నిర్మాణాల పురోగతిని ఎప్పటి కప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ.. పనులను వేగవంతం చేయాల్సి ఉంది.  ఈ మేరకు డ్వామా, పంచాయతీ రాజ్‌ , ఇతర శాఖల అధికారులు  విస్తృతంగా జిల్లాలో పర్య టిస్తూ.. పనుల వేగవంతానికి చర్యలు చేపడుతున్నారు.  జిల్లావ్యాప్తంగా 664 సచివాలయాల భవనాలకు  ప్రభుత్వం రూ.247 కోట్లు మంజూరు చేసింది. ఆగస్టు నాటికి కనీసం 300 భవనాలు అందుబాటులోకి రావాలని కలెక్టర్‌ ఆదేశించారు. 618 ఆర్‌బీకే భవనాలకు  రూ.136 కోట్లు  మంజూరు  చేయగా, జూలై చివరి నాటికి కనీసం 125 భవనాలు పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించింది. 465 వెల్నెస్‌ సెంటర్‌ భవనాలకు రూ.76 కోట్లు  కేటాయించగా జూలై చివరికి 125 భవనాలు పూర్తి చేయాలని గడువు విధించారు.  మొత్తంగా జిల్లాలో రూ.500 కోట్లకు పైగా ఉపాధి కాంపోనెంట్‌ నిధులతో భవన నిర్మాణాలు జరుగుతు న్నాయి. కానీ చాలా చోట్ల ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. సకాలంలో బిల్లులు చెల్లించక పోవడమే కారణంగా తెలుస్తోంది.  

  నెల్లిమర్ల,: మండలంలో  ఆర్‌బీకే, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పనులను వచ్చే నెల 8 లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో కె.రాజ్‌కుమార్‌ సూచించారు.  భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా  సారిపల్లిలో ఆర్‌బీకే, హెల్త్‌ వెల్‌నెస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.  ఈవోపీఆర్‌డీ  భానోజీరావు, సర్పంచ్‌ పైడమ్మ, మాజీ సర్పంచ్‌ విభీషణరావు, వైసీపీ నాయకులు  గుర్నాథరావు, అధికారులు పాల్గొన్నారు. 

  బాడంగి: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో  జడ్పీ  సీఈవో వెంకటేశ్వరరావు  అభివృద్ధి పనులపై సమీక్షించారు. మండలంలో  సచివాలయ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్టు చూడాలన్నారు.  వెల్ఫేర్‌ అసిస్టెంట్లు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు. ఆయన  వెంట ఎంపీడీవో పట్నాయక్‌, సిబ్బంది ఉన్నారు.  

 

Updated Date - 2021-06-18T05:11:59+05:30 IST