Abn logo
Sep 2 2021 @ 09:53AM

మెదక్ జిల్లాలో దొంగల బీభత్సం

మెదక్: జిల్లాలోని నర్సాపూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పలు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు భారీ నగదు, నగలను ఎత్తుకెళ్లారు.  నర్సాపూర్ పట్టణంలోని పెద్దమ్మ కాలనీలో పరశురాం అనే వక్తి ఇంట్లో రూ.50 వేల నగదుతో పాటు 5 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. అలాగే సత్యనారాయణ అనే వక్తి ఇంట్లో 4 తులాల బంగారు  నగలను దుండుగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.