Abn logo
Jul 15 2021 @ 10:50AM

మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

మెదక్: మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  జిల్లాలో 6.1 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా చేగుంట మండలంలో 21.7 సెంటీమీటర్లు, శివ్వంపేటలో 11.6 సెంటీమీటర్లు, తూప్రాన్‌లో 10.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 2.1 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయ్యింది. అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.