నిషేధం.. నామ్‌కే వాస్తే!

ABN , First Publish Date - 2022-01-20T06:09:15+05:30 IST

నిషేధం.. నామ్‌కే వాస్తే!

నిషేధం.. నామ్‌కే వాస్తే!

మేడారంలో  పాస్టిక్‌ భూతం 

నిర్మూలనపై దృష్టి సారించని యంత్రాగం 

గతంలో నాలుగు రోజుల్లో  2 వేల టన్నులకు పైగా చెత్త

 921 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వస్తువులే..

 గాజు బాటిళ్లు, జంతు వ్యర్థాలతో  వాతావరణ కాలుష్యం

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నా రు. మహాజాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఉండగా వనదేవతలను  వేలాది మంది దర్శించు కుంటున్నారు. తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లిం చుకుంటున్నారు. మహాజాతరకు కోటికి పైగా భక్తులు వివిఽధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షలు ఉన్నప్పటికీ నెల రోజుల ముందుగానే భారీ సంఖ్యలో మేడారం బాటపడుతున్నారు. అయితే.. ఇక్కడ ప్లాస్టిక్‌ నిర్మూలన నామ్‌కే వాస్తే అన్నట్టు ఉంది. వాటర్‌, కూల్‌డ్రింక్స్‌ బాటిళ్లు, కవర్ల వినియోగం విచ్చల విడగా ఉంది. దాదాపు భక్తులు అందరూ ఏదోక ప్లాస్టిక్‌ వస్తు వును ఉప యోగించడం నిత్యకృత్యమైంది. దీంతో మేడారం పరిసరాలన్నీ ప్లాస్టిక్‌ మయమైంది. ఒకవైపు ఈ ఉత్పత్తులకు నిషేధం ఉన్నప్పటికీ అలాంటిదేమీ ఇక్కడ కనిపించడం లేదు. దీంతో పర్యావరణానికి పెను ముప్పు ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.  

నాలుగు రోజుల్లో రెండు వేల టన్నులు..

మేడారం మహాజాతర జరిగే నాలుగు రోజుల్లోనే సుమారు రెండు వేల టన్నులకు పైగా చెత్త పోగవు తుంది. 2018లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మహాజాతరను నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఆ నాలుగు రోజులు శాపింల్స్‌ సేకరించి 1,879 టన్నుల చెత్త పోగ యినట్టు గుర్తించారు. ఇందులో ప్లాస్టిక్‌ 750 టన్నులు కాగా జంతు వ్యర్థాలు 381 టన్నులు ఉన్నాయి. 2020 మహాజాతర నాటికి చెత్త మరింత పెరిగింది. జాతర జరిగిన నాలుగు రోజుల్లో 2,080 టన్నుల చెత్తను గుర్తించారు. ఇందులో 921 టన్నులు ప్లాస్టిక్‌, 420 టన్నులకు పైగా జంతు వ్యర్థాలు పోగయినట్టు అధికా రులు గుర్తించారు. మిగతా చెత్తలో భూమిలో తేలికగా కలిసిపోయే  బియ్యం, బెల్లం, కొబ్బరి, ఆహార వ్యర్థాలు తదితరాలు ఉన్నాయి. 52 శాతం భూమిలో కలిసి పోయే చెత్త ఉండగా, భూమిలో తేలికగా కలిసి పోని ప్లాస్టిక్‌ 48 శాతం ఉంది. వందల ఏళ్ల వరకు కూడా భూమిలో కలిసిపోలేని ప్లాస్టిక్‌ ప్రతి మహాజాతర సం దర్భంగా మేడారం పరిసరాల్లో పోగవుతోంది. పోగ వుతున్న చెత్త నిర్వహణకు సంబంధించి అధికారులు ఆధునీక పద్ధతులు అవలంబించకపోవటంతో పచ్చని అడవులు కాలుష్య కాటుకు గురవుతున్నాయనే ఆం దోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  

ఎక్కడి చెత్త అక్కడే పూడ్చివేత

మహాజాతర సందర్భంగా వేల టన్నుల్లో పోగవుతు న్నా చెత్తను స్థానికంగా ఉన్న అడవుల్లోనే పూడ్చివేయ టం లేదా కాల్చి వేయడం చేస్తున్నారు. మేడారం చు ట్టు పక్కల ఉన్న నార్లాపూర్‌, కొంగలగుట్ట, గుడ్డేలుగు గుట్ట, రెడ్డిగూడెం, ఊరట్టం తదితర ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో భారీ గుంతలు తవ్వుతుంటారు. ప్రతి మహా జాతరలో ఉత్పత్తి అయ్యే కోళ్లు, మేకలు, గొర్రేల వ్యర్థా లు, కొబ్బరి చిప్పలు, బియ్యం, బెల్లం, గాజులు తదితర వాటిని ఇందులో వేసి పూడ్చేస్తున్నారు. 2020 మహా జాతరలో సుమరు రెండు లక్షల మేకలు, గొర్రెలు, కోళ్లు తెగి నట్టు అంచనా. వీటి వ్యర్థాలన్నింటినీ  భూమిలో పూడ్చే శారు. ఇక కవర్లు, బాటిళ్లతో పాటు ఇతర ప్లాస్టిక్‌ సం బంధించిన చెత్తను కాల్చి వేస్తుంటారు. దీంతో జంతువు ల వ్యర్థాలను పూడ్చి వేసిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ నేపథ్యం లో నీటిలో ఫ్లోరైడ్‌ శాతం పెరిగినట్టు ఇటీవల నార్లా పూర్‌లో చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో భవిష్య త్తులో మేడారం చెత్తతో మరింత నష్టాలను ఎదు ర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్త మవుతోంది.

కార్మికులు శ్రమించినప్పటికీ...

నిపుణుల అంచనా ప్రకారం పాలిఽథిన్‌ కవర్‌ నుంచి పీవీసీ పైపుల వరకు గత జాతరలో 921 టన్నుల ప్లాస్టిక్‌ చెత్త  చేరినట్టు గుర్తించారు. ఇందులో సన్న ప్లాస్టిక్‌ కవర్లు  ఏకంగా 200 టన్నులుగా నమోదైనట్టు సమాచారం. సుమారు రెండు వేల మందికి పైగా పా రిశుధ్య కార్మికులు శ్రమించినప్పటికీ జాతర ప్రాంతం లోని పొలాల్లో ప్లాస్టిక్‌ కవర్లు పేరుకు పోతున్నాయి. డంపింగ్‌ యా ర్డుల్లో నిల్వ చేసిన చెత్త నుంచి ప్లాస్టిక్‌ కవర్లు గాలి లో కొట్టుకుపోయి అడవుల్లో పరుచుకుంటున్నాయి. వా టిని తినటం వల్ల వన్య ప్రాణులు, ఇతర జంతు వులు అనారో గ్య బారినపడుతున్నట్టు అధి కారులు గుర్తించారు. డం పింగ్‌ యార్డుల్లో ని ల్వ చేసి న ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల ఏర్ప డే పోగ తో అడవుల్లో ఉండే జంతు వులు, పక్షులపై ప్రభావం పడుతు న్నట్టు తెలుస్తోంది.  మరోవైపు మే డారం మహాజాతరలో మ ద్యం ఏరులైపారుతోంది. 2018లో రూ.7 కోట్లు, 2020లో రూ.10.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇవి కాకుండా ఆయా ప్రాంతాల నుంచి కొను గోలు చేసి, జాతరకు తీసుకొచ్చిన మద్యం కూడా లెక్కే స్తే సుమారు రూ.70 కోట్లకు మద్యం వినియోగమైనట్టు అంచనా. ఫలితంగా జాతర ముగిసిన తర్వాత లక్షల్లో గాజు మద్యం బాటి ళ్లు దర్శనమిస్తాయి. మహాజాతరలో పోగ వుతున్న వ్యర్థాల్లో సుమారు 100టన్నులకు పైగా బాటిళ్లే ఉంటు న్నట్టు అధికారులు అంటున్నారు. వీటిలో 50శాతం రీసైక్లింగ్‌ అవుతుండగా, మిగతా  బాటిళ్లు జాతర అవ రణలో పగిలిపోతున్నాయి. ఇలా జాతర జరిగే ప్రాం తాల్లో గాజు పెంకులు ఉండటం వల్ల పొలాల్లోకి వెళ్లే రైతులకు, కూలీలకు, పశువులకు గాయాలవుతున్నాయి.  

ఈసారి ప్రచారమేదీ..?

ప్రతి మహాజాతర సమయంలోనూ ప్లాస్టిక్‌ వాడ కంపై  ప్రచారం నిర్వహించేవారు. మీడియాతో పాటు కరపత్రాలు, వాల్‌ రైటింగ్‌, కాలకేయ లాంటి విగ్రహా లు పెట్టి ప్లాస్టిక్‌ను భూతంగా ప్రచారం చేసేవారు. గత మహాజా తరలో ప్లాస్టిక్‌పై జిల్లా యంత్రాంగం యుద్ధమే ప్రకటించింది.  ప్రస్తుతం అధికారుల ధ్యాసంతా ప్రభుత్వం కేటాయించిన రూ.75కోట్ల పనులపైనే ఉందనే టాక్‌ వినిపిస్తోంది. పర్యావరణంపై అధికారులు దృష్టి పెట్ట లేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మేడారంతో చుట్టు పక్కల 13 గ్రామాల్లోని సుమారు 10వేల మంది కి పైగా ఆదివాసీల జీవితాలపై ప్రభావం చూపించే ప్లాస్టిక్‌ భూతంపై అధికారులు దృష్టిసారించకపోవటం పై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-20T06:09:15+05:30 IST