Abn logo
Sep 4 2021 @ 09:17AM

Medchalలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు స్నేహితులు మృతి

మేడ్చల్: జిల్లాలోని దుండిగల్  బౌరంపేట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న డీసీఎంను వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు సూరారం నివాసి ప్రమోద్ రెడ్డి(22), వరంగల్‌కు చెందిన సునై రెడ్డి(22)గా గుర్తించారు. సూరారంలో ఉన్న ప్రమోద్ రెడ్డిని కలిసేందుకు వరంగల్ నుండి  సునై రెడ్డి వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12:00 గంటల సమయంలో అతివేగంగా పల్సర్‌ డ్రైవ్ చేస్తూ ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.