Abn logo
May 17 2021 @ 08:51AM

రైల్వేస్టేషన్లలో వైద్య సహాయ కేంద్రాలు

చెన్నై/పెరంబూర్‌: తాంబరం సహా 10 రైల్వేస్టేషన్లలో ఉచిత వైద్య సహాయ కేంద్రాల ఏర్పాటుకు అర్హులెనౖ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, చెన్నై సెంట్రల్‌, ఎగ్మూర్‌ రైల్వేస్షేన్లలో మాత్రమే ఉచిత వైద్య సహాయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యార్ధం మాంబళం, తాంబరం, తిరువళ్లూర్‌, పెరంబూర్‌, తిరుత్తణి, మేల్‌ మరువత్తూర్‌, ఆంబూరు, ఆవడి, చెంగల్పట్టు, అరక్కోణం రైల్వేస్టేషన్లలో ఉచిత వైద్య సహాయ కేంద్రాల ఏర్పాటుకు టెండర్ల ఆహ్వానించామని, ఇలాంటి కేంద్రాలను భవిష్యత్తులో ప్రధాన రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

జాతీయంమరిన్ని...

Advertisement