Abn logo
Jun 13 2021 @ 00:00AM

ఈటలను కలిసిన మేడ్చల్‌ బీజేపీ నేతలు

ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన బీజేపీ నేతలు

మేడ్చల్‌ : రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మేడ్చల్‌ బీజేపీ నేతలు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, కొంపల్లి మోహన్‌రెడ్డి, కృష్ణాగౌడ్‌, తదితరులు ఈటల రాజేందర్‌ను కలిసి, శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.