చెక్‌పోస్టుల వద్ద వైద్యపరీక్షలు

ABN , First Publish Date - 2020-05-16T05:52:41+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

చెక్‌పోస్టుల వద్ద వైద్యపరీక్షలు

మేడ్చల్‌ : కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను, ఇతరులను తరలించే ప్రక్రియ కొనసాగుతుండటంతో వారి ద్వారా కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బందితో బృందాలను ఉంచింది.


ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అనుమానం వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే వివరాలు రాసుకుని పంపిస్తున్నారు. ఆశావర్కర్లతో పాటు ఒక ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని నిలిపి వాహనాల్లో వచ్చే వారి టెంపరేచర్‌ చెక్‌ చేస్తున్నారు. 98.5 డిగ్రీల టెంపరేచర్‌ కంటే ఎక్కువ ఉంటే వారిని ఆసుపత్రికి తరలించి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-05-16T05:52:41+05:30 IST