రుయా ఫార్మసిస్టు వ్యవహారంపై వైద్య ఆరోగ్యశాఖ ఆరా!

ABN , First Publish Date - 2021-08-02T06:31:17+05:30 IST

రుయాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు త్యాగరాజులు శనివారం ఆత్మహత్యకు యత్నించాడని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.

రుయా ఫార్మసిస్టు వ్యవహారంపై  వైద్య ఆరోగ్యశాఖ ఆరా!

తిరుపతి సిటీ,  ఆగస్టు 1: రుయాస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు త్యాగరాజులు శనివారం  ఆత్మహత్యకు యత్నించాడని సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం తనను వివరణ కోరినట్లు రుయా సూపరింటెండెంట్‌ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. త్యాగరాజులును ఎవరూ ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారని వివరించారు. 

Updated Date - 2021-08-02T06:31:17+05:30 IST