Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కుర్రాడి పెళ్లి జరిగేది.. కానీ నిశ్చితార్థం జరిగిన మూడ్రోజులకే..

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఒక డాక్టర్.. ఈ మధ్యే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయికి కూడా అతడు నచ్చడంతో.. ఇరు కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. గత నెల 22న ఎంగేజ్‌మెంట్ కూడా జరిపించి.. పెళ్లి తేదీని ఖరారు చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఫిబ్రవరిలో మనసుకు నచ్చిన అమ్మాయి మెడలో అతడు తాళి కట్టేవాడు. నిశ్చితార్థం జరిగిన మూడు రోజులకే ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో అంతా తారుమారైంది. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్ అరవింద్ పటేల్.. సాగర్ జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి పెళ్లి చేయడానికి.. కుటుంబ సభ్యులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ మధ్యే ఓ అమ్మాయిని చూసిన అరవింద్.. ఆమెను ఇష్టపడ్డాడు. అమ్మాయి కూడా అతడు నచ్చడంతో.. ఇరు కుటుంబ సభ్యులు గత నెల 22న నిశ్చితార్థం జరిపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న పెళ్లి మూహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే.. ఫిబ్రవరిలో అరవింద్ తనకు నచ్చిన అమ్మాయి మెడలో మూడు ముళ్లూ వేసేవాడు. కానీ నిశ్చితార్థం అయిన మూడు రోజులకే అతడు.. డెంగ్యూ బారినపడటంతో అంతా తారుమారైంది. 


డెంగ్యూ బారినపడిన అరవింద్‌కు ప్లేట్‌లెట్స్ సంఖ్య 12 వేలకు పడిపోవడంతో.. అతడి ఆరోగ్యం క్షీణించింది. క్రమంగా అతడి ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలయం, గుండే.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పని చేయడం మానేశాయి. దీంతో శుక్రవారం రోజు అతడు మరణించాడు. దీంతో అరవింద్ కుటుంబ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement