మెడికల్‌ రిప్స్‌ సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2022-01-20T05:09:33+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 19: మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని సేల్స్‌ ప్రమోషన్‌, ఎంప్లాయీస్‌ యాక్ట్‌ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మెడికల్‌ రిప్స్‌ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ మెడికల్‌ రిప్స్‌ నిర్వహించిన సమ్మె విజయ

మెడికల్‌ రిప్స్‌ సమ్మె విజయవంతం
కాకినాడలో ధర్నా చేస్తున్న దృశ్యం

భానుగుడి (కాకినాడ), జనవరి 19: మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని సేల్స్‌ ప్రమోషన్‌, ఎంప్లాయీస్‌ యాక్ట్‌ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మెడికల్‌ రిప్స్‌ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ మెడికల్‌ రిప్స్‌ నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. ఏపీఎంఎ్‌సఆర్‌యూ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి సి.వెంకట్రావు, సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కేంద్రప్రభుత్వం యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై పూర్తిగా జీఎస్టీ తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మందుల అమ్మకాలు ఆపాలని కోరారు. మెడికల్‌ రిప్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 9 పని గంటలను నిర్దిష్టంగా అమలుచేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.వెంకన్న, కాకినాడ కార్యదర్శి ఏఆర్‌సీ వర్మ, కె.అప్పారావు, కోశాధికారి కృష్ణ, సత్యశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:09:33+05:30 IST