అందరికీ పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-05-23T08:50:40+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన నూతన క్వారంటైన్‌ మార్గదర్శకాలను వైద్య సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్‌-19 విధుల తర్వాత ఎక్కువ రిస్క్‌తో ఉన్నట్టు బయటపడితే తప్ప వైద్య సిబ్బందికి క్వారంటైన్‌ అవసరం...

అందరికీ పరీక్షలు నిర్వహించాలి

  • తగిన క్వారంటైన్‌ ఉండాలి
  • వైద్య సిబ్బంది డిమాండ్‌ 

న్యూఢిల్లీ, మే 22: కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన నూతన క్వారంటైన్‌ మార్గదర్శకాలను వైద్య సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్‌-19 విధుల తర్వాత ఎక్కువ రిస్క్‌తో ఉన్నట్టు బయటపడితే తప్ప వైద్య సిబ్బందికి క్వారంటైన్‌ అవసరం లేదన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చే స్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పలు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. క్వారంటైన్‌లో భాగంగా హోటళ్లలో ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఖాళీ చేయాలని, ఒకవేళ ఖాళీ చేయకుండా ఎక్కువ కా లం ఉంటే అందుకయ్యే అదనపు చార్జీలను వారి వేతనాల నుంచి తగ్గించనున్నట్టు ఇప్పటికే పలు ఆస్పత్రులు ప్రకటించాయి. కొవిడ్‌-19 విధుల్లో  వైద్య సిబ్బందికి తగిన క్వారంటైన్‌ ఉండాలని, పరీక్షలు నిర్వహించాలని ఫెడరేషన్‌ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఓఆర్‌డీఏ) డిమాండ్‌ చేస్తోంది. ఇంక్యుబేషన్‌ కాలపరిమితి 2 నుంచి 14 రోజులు ఉంటుందని, రెండో పరీక్షలో డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంఘటనలున్నాయని లేఖ ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు తెలియజేసింది.

Updated Date - 2020-05-23T08:50:40+05:30 IST