వైద్య సిబ్బంది అవస్థలు

ABN , First Publish Date - 2020-03-27T10:05:26+05:30 IST

మండలంలోని పినకోట పీహెచ్‌సీ పరిధిలోని చటాకంబ గ్రామానికి వెళ్లడానికి వైద్య సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ఏఎన్‌ఎంలు

వైద్య సిబ్బంది అవస్థలు

దేవరాపల్లి: మండలంలోని పినకోట పీహెచ్‌సీ పరిధిలోని చటాకంబ గ్రామానికి వెళ్లడానికి వైద్య సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. ఏఎన్‌ఎంలు జి.వరలక్ష్మి, విజయకుమారి గురువారం ఈ గ్రామంలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి పినకోట నుంచి నడుచుకుంటూ బయలుదేరారు. దారిలో రెండు మూడుచోట్ల రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు పడవేసి వున్నాయి.  చాలా ఎత్తుగా వుండడంతో వాటిని దాటుకుని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మారుమూలన వున్న ఈ గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రారని, అయినప్పటికీ రహదారిని మూసివేయడం వల్ల అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-27T10:05:26+05:30 IST