కరోనాపై పోరాటానికి వైద్యవిద్యార్థుల ముందడుగు

ABN , First Publish Date - 2020-03-30T17:24:04+05:30 IST

కరోనాపై పోరాడేందుకు వైద్యవిద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులను రంగంలోకి దించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది....

కరోనాపై పోరాటానికి వైద్యవిద్యార్థుల ముందడుగు

న్యూఢిల్లీ : కరోనాపై పోరాడేందుకు  వైద్యవిద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులను కూడా రంగంలోకి దించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో వైద్యవిద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవడం ద్వార వైద్యరంగంలో యువశక్తి పెరుగుతుందని డాక్టర్లు చెప్పారు. దేశంలో ప్రస్థుతం ప్రతీ 1500 మందికి ఓ వైద్యుడు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిబంధనల ప్రకారం ప్రతీ వెయ్యిమందికి ఓ వైద్యుడు ఉండాలి. దీంతో వైద్యవిద్యార్థుల సేవలను కూడా వాడుకోవాలని వైద్యమండలి నిర్ణయించడంతో వారు కూడా ముందుకు వచ్చారు. కరోనా వైరస్ పై పోరాడేందుకు దేశంలోని దంతవైద్యులను కూడా ఆశ్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందించడానికి 40వేలమందికిపైగా అనస్థీషియా డాక్టర్లు అవసరమవుతారు. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో 15 నుంచి 25 మంది నిపుణులైన వైద్యులు మాత్రమే ఉన్నారు. రోగుల సంఖ్య పెరిగితే వారికి వైద్యసేవలందించేందుకు వీలుగా ఫైనల్ ఈయర్ ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులను రంగంలో దించారు. వైద్యవిద్యార్థులే కాకుండా నర్సింగ్ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు.

Updated Date - 2020-03-30T17:24:04+05:30 IST