Abn logo
Sep 21 2021 @ 01:29AM

పారా మెడికల్‌ విద్యార్థిని హత్య

కాకినాడ క్రైం, సెప్టెంబరు 20: దాంపత్యంలో ఉన్న మనస్పర్థల కారణంగా ఓ పారా మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఘటన కాకినాడ చోటుచేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎనస్తీషియా ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే ఆమె పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన 21 ఏళ్ల మానేపల్లి గంగరాజును పది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న సుధారాణి ఈనెల 17న తన భర్త కాకినాడ రావడంతో స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్‌ తీసుకు న్నారు. ఆదివారం రాత్రి ఏదో ఒక విషయంలో గొడవపడ్డారు. దాంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయాడు. అక్కడి పోలీ సులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ ఎస్‌డీపీవో వి.భీమారావు, టూటౌన్‌ ఎస్‌ఐ పి.ఈశ్వరుడు సోమవారం రాత్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఒక్కడే హత్యలో పాల్గొన్నాడా, మరెవరైనా పాలుపంచుకున్నారా అనే దానిపై క్లూస్‌టీమ్‌ రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించింది. అనంతరం మృత దేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.