Abn logo
Sep 25 2021 @ 22:47PM

పదకవిత్వం రసామృతం వంటిది

కవి రామోజు లక్ష్మిరాజయ్యను సన్మానిస్తున్న సభ్యులు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 25: పద కవిత్వం రసామృతం వంటిదని మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్‌ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు బి.వెంకట్‌ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సాహిత్య చర్చ గోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పద్యము రసామృతమాన్ని పండిస్తుందని చెప్పారు. వచన కవిత్వము సమాజాన్ని చైతన్య పరుస్తుందన్నారు. గేయకవిత్వం కవి హృదయా లను నుంచి వచ్చి, అందరిని రంజింప చేస్తుందని తెలిపారు. ప్రాచీన కవులు  సంస్కృత  భాషలో శ్లోకాలను రచించారని, ఆదికవిగా వాల్మీకి మహర్షి గుర్తింపు పొందారని  వివరించారు. సంస్కృత పంచ మహాకావాల్యకు తెలంగాణ కవి మల్లినాథసూరి గొప్ప వ్యాఖ్యానమును రచించారని అభిప్రాయపడ్డారు. కాగజ్‌నగర్‌కు చెందిన కవి శ్రీ రామోజు లక్ష్మిరాజయ్యకు కవిశిఖర, కవిరత్న, కవి చక్ర బిరుదలను ప్రదానం చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే 105 అంశాలతో కూడిన చక్కటి గేయాలు, కవితలు రాస్తూ అందరిని మెప్పించారని కొనియాడారు. ఈ సందర్భంగా జ్ఙాపికలు అందజేసి, శాలువాలతో లక్ష్మిరాజయ్య దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో తెలుగు సాహితి సంస్థ కోశాధికారి సంగర్స్‌ జగన్‌ మోహన్‌రావు, కార్యదర్శి కటకం మధూకర్‌, కార్యనిర్వహక అధ్యక్షుడు మామిడాల తిరుపతయ్య, సభ్యులు జగదీశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్‌శర్మ, ముద్దు రాజేంద్రప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.