Abn logo
Sep 22 2021 @ 01:40AM

చదువుకు మీడియం, పాఠశాల ముఖ్యం కాదు

నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్న అమెరికా గణిత ప్రొఫెసర్‌ హనుమంతరావు

ఎనఆర్‌ఐ, ప్రొఫెసర్‌ పాదరాజు హనుమంతరావు

భువనగిరిటౌన, సెప్టెంబరు 21: చదువుకు మీడియం, పాఠశాల ముఖ్యం కాదు.. ఆసక్తి, ఇష్టంతో చదివితే ఎక్కడైనా రాణించగలమని ఎనఆర్‌, ప్రొఫెసర్‌ పాదరాజు హనుమంతరావు అన్నారు. తన తల్లి పాదరాజు జయప్రద జ్ఞాపకార్ధం బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బీచమహల్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, విద్యా సామగ్రిని ఆయన అందజేసి మాట్లాడారు. భువనగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుని  ప్రస్తుతం అమెరికాలోని  క్లేవ్‌ల్యాండ్‌  క్యూయాహోగా కమ్యూనిటీ కళాశాలలో గణిత ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా నన్నారు. కార్యక్రమంలో హెచఎం సీహెచ సత్యనారాయణరెడ్డి, సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, సమ న్వయకర్త కాచరాజు జయ ప్రకాష్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకవరం రమేష్‌, రామేశ్వర్‌రావు, చందుపట్ల విశ్వేశ్వర్‌రావు, సామాజిక కార్యకర్త వెల్లంకి పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.