Jul 23 2021 @ 08:19AM

'బ్రో డాడీ'లో మీనా

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బ్రో డాడీ' మూవీలో సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతంలో మోహన్ లాల్ - మీనా కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చి హిట్ సాధించాయి. ఇక ఈ మధ్యకాలంలో వీరు నటించిన  'దృశ్యం', 'దృశ్యం-2' కూడా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇదే క్రమంలో మరోసారి మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్రో డాడీ'లో నటించే అవకాశం అందుకున్నారు మీనా. ఇటీవల షూటింగ్‌లో కూడా ఆమె జాయిన్ అయ్యారు. ఇంతకముందు మోహన్ లాల్‌తో 'లూసిఫర్' తీసి డైరెక్టర్‌గా మారిన స్టార్ హీరో పృధ్వీరాజ్ మరోసారి ఆయనతోనే 'బ్రో డాడీ'ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గత వారం హైదరాబాద్‌లో ప్రారంభమయింది. ఇందులో మోహన్ లాల్, పృధ్వీరాజ్, కళ్యాణీ ప్రియదర్శన్, మీనా, లాలు అలెక్స్, మురళీ గోపి, సౌబిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.   

Otherwoodsమరిన్ని...