May 18 2021 @ 07:51AM

కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ప్రశ్న

తెలుగులో వాన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బంగారం వంటి చిత్రాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మీరా చోప్రా. కరోనా మహమ్మారి కారణంగా వారం రోజుల వ్యవధిలో ఆమె కుటుంబంలో ఇద్దరు సభ్యులు మృత్యువాతపడ్డారు. దీంతో ఆమె కేంద్ర ప్ర‌భుత్వాన్ని సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌శ్నిస్తున్నారు. కొవిడ్‌ కష్టకాలంలో అనేక మంది కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు లభించక, ఒక వేళ బెడ్‌ దొరికినా ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పో తున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కనీసం ఆస్పత్రిలో పడక సౌకర్యం కల్పించలేనపుడు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని సినీ నటి మీరా చోప్రా ప్రశ్నిస్తోంది. తక్షణం ఈ 18 శాతం జీఎస్టీని తొలగించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా రోగులకు కనీసం పడకను కూడా సమకూర్చలేని దుస్థితి లో ఉంటే 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని, తక్షణం  రద్దు చేయాలని మీరా చోప్రా ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.