Apr 16 2021 @ 23:24PM

మీరా జాస్మిన్‌ రీ ఎంట్రీ

కళ్లతోనే హావభావాలను వెండితెరపై ఆవిష్కరించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హీరోయిన్‌ మీరాజాస్మిన్‌. 2014లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తోన్న జాన్‌ టైటాన్‌తో మీరా వివాహం జరిగింది. ఆ తర్వాత ఏటా ఒకట్రెండు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా 2018లో ‘పూమారం’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆమె మరే చిత్రంలోనూ నటించలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని మీరా జాస్మిన్‌ నిర్ణయించుకున్నారు. ‘అల వైకుంఠపురములో’ ఫేం జయరాం హీరోగా సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ మలయాళ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకరించారు. ఈ విషయాన్ని సత్యన్‌ అంతికాడ్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. జులైలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభంకానుంది.