Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.10కే ఖరీదైన ఆహారం... రుచి చూడకుండానే రూ.49 వేలు పోగొట్టుకున్న టీచర్!

మీరఠ్: రోజురోజుకు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ... మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించి చేస్తున్న మోసాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. 

తాజాగా యూపీలోని మీరఠ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయురాలికి ప్రముఖ రెస్టారెంట్ పేరుతో ఒక ఆకర్షణీయమైన మెసేజ్ వచ్చింది. కేవలం రూ. 10 కే ఖరీదైన ‘థాలీ’ అందిస్తున్నట్లు దానిలో ఉంది. దీనిని చూసిన ఆ టీచర్ మెసేజ్ కిందనున్న లింక్‌ను క్లిక్ చేశారు. వెంటనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ. 49 వేలు మాయమయ్యాయి. దీంతో కంగుతిన్న టీచర్ వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగౌ సైబర్ పోలీసులు మాట్లాడుతూ ఆన్‌లైన్ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement