Aug 1 2021 @ 00:21AM

ఫస్ట్‌ సక్సెస్‌ మీట్‌

‘‘ది హీరోగా నా ఫస్ట్‌ సక్సెస్‌ మీట్‌. నిన్న ‘తిమ్మరుసు’ చిత్రం రిలీజయ్యాక థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూశాక భావోద్వేగానికి గురయ్యాను’’ అని హీరో సత్యదేవ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘తిమ్మరుసు’ శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘‘సమష్టి కృషితోనే ‘తిమ్మరుసు’ లాంటి గొప్ప విజయం సొంతమైంది. మా సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ క్రెడిట్‌ దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి, ప్రియాంక జవాల్కర్‌, బ్రహ్మాజీలకు దక్కుతుంది’’ అని అన్నారు. ‘సినిమాను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. ‘ఓవర్సీస్‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది’’ అని నిర్మాత మహేశ్‌ ఎస్‌. కోనేరు తెలిపారు. ‘‘చిన్న సినిమాకు పెద్ద సక్సెస్‌ ఇచ్చారు’’ అని బ్రహ్మాజీ  చెప్పారు. ‘‘తిమ్మరుసు’లో నా పాత్రకు వచ్చిన ప్రశంసలతో చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్‌ చెప్పారు.

  • - సత్యదేవ్‌