సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2020-11-27T05:30:00+05:30 IST

సర్వసభ్య సమావేశం

సర్వసభ్య సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ యాదమ్మ

  • రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ల ఆవేదన
  • ప్రతీ గ్రామంలో కరోనా టెస్టులు నిర్వహిస్తాం : వైద్యాధికారి వెల్లడి

చౌదరిగూడ: మూడు నెలలకోసారి నిర్వహించే మండల పరిషత్‌ సమావే శాన్ని శుక్రవారం ప్రారంభించిన గంటలోపే ముగించారు. కొద్ది అధికారులే సమావేశానికి హాజరయ్యారు. మిగితా అధికారులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విఽధులు నిర్వహిస్తుండటం వలన రాలేకపొయారు. కొందరు సర్పంచ్‌లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో రానందున సమావేశాన్ని వాయిదా వేయాలని సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు కోరారు. సమావేశానికి కోరం ఉందని ఎంపీపీ యాదమ్మ సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశం ప్రారంభించగానే అక్కడికి వచ్చిన టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వెళ్లిపొయారు. నలుగురు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లతో ఎంపీపీ ఎస్‌.యాదమ్మ సమావేశాన్ని కొనసాగించారు. అధికారులు ప్రణాళిక చదివే సమయంలో ప్రజాప్రతినిధులు లేక సభ గంటలోపే ముగిసింది. అధికారులు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చెయ్యడంలేదని, రైతుల కష్టాలు ఎవరు తీర్చాలని పెద్దఎల్కిచర్ల సర్పంచ్‌ భూపాలచారి వ్యవసాయధికారి సీతారాంను ప్రశ్నించారు. ఈ విషయాన్ని పైఅధికారులకు తెలియజేస్తానని ఆయన వివరించారు. నివర్‌ తుఫానుతో రైతులు జాగ్రత్తగా ఉండాలని, వరికోతలు నిలిపివేయాలని ఆయన చెప్పారు. ప్రతీ గ్రామంలో కరోనా టెస్టులు చేస్తామని వైద్యాధికారి డాక్టర్‌ అమృత జోసెఫ్‌ తెలిపారు. గ్రామాల్లోని టీబీ పేషంట్లు ప్రతొక్కరూ పరీక్ష చేయించుకునేలా సర్పంచ్‌లు సహకరించాలని ఆమె కోరారు. వైస్‌ఎంపీపీ అస్రాబేగం, ఎంపీవో విజయ్‌కుమార్‌పాల్‌, డీటీ శంకర్‌, ఎపీఎమ్‌ నర్సింలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:30:00+05:30 IST