ఏఎన్‌యూలో ఎన్‌ఏబీహెచ్‌పై సదస్సు

ABN , First Publish Date - 2021-03-09T15:23:29+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేషనల్‌ ఎక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ మరియు హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌పై సోమవారం రెండు రోజుల అవగాహన..

ఏఎన్‌యూలో ఎన్‌ఏబీహెచ్‌పై సదస్సు

పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేషనల్‌ ఎక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్‌ మరియు హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌పై సోమవారం రెండు రోజుల అవగాహన సదస్సు ప్రారంభమైంది. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రత్నషీలా మణి, వాణిజ్య విభాగపు డీన్‌ ఆచార్య శివరామ్‌ హెల్త్‌కేర్‌ విభాగాల్లో జరగాల్సిన సరళీకరణలను సూచించారు. ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యాంసన్‌ సంజీవరావు మాట్లాడుతూ హెల్త్‌కేర్‌ సెక్టార్‌లో నాణ్యతా ప్రమాణాల అమలు గురించి వివరించారు. రాష్ట్ర వైద్య విభాగంలో నాణ్యతా సలహాదారు వాసుబాబు మాట్లాడుతూ హాస్పిటల్‌లో రోగుల హక్కులు, వాటి అమలులో హాస్పిటల్‌ యాజమాన్యాలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ తులసీదాస్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ డేవిడ్‌రాజు, డాక్టర్‌ సాధిక్‌, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T15:23:29+05:30 IST