ప్లాస్టిక్‌తో కాలుష్య ముప్పు : కమిషనర్‌

ABN , First Publish Date - 2021-09-29T04:49:55+05:30 IST

రాబోవు రోజుల్లో ప్లాస్టిక్‌ ముప్పు పొంచి ఉందని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ అన్నారు. ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు అంశంపై మంగళవారం ఆయన కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ కవర్లు అత్యంతం ప్రమాదకరమన్నారు.

ప్లాస్టిక్‌తో కాలుష్య ముప్పు : కమిషనర్‌
అవార్డును అందచేస్తున్న కమిషనర్‌ దినేష్‌

కార్పొరేషన్‌తో పని చేసిన వ్యక్తులకు అవార్డులు 

నెల్లూరు (సిటీ), సెప్టెంబరు 28 : రాబోవు రోజుల్లో ప్లాస్టిక్‌ ముప్పు పొంచి ఉందని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ అన్నారు. ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు అంశంపై మంగళవారం ఆయన కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ కవర్లు అత్యంతం ప్రమాదకరమన్నారు. వాటిల్లో వేడి పదార్థాలు వేయడం వల్ల అందులోని విషకణాలు ఉత్పన్నమై కేన్సర్‌కు దారితీస్తాయన్నారు. ప్రజల్లో అవగాహన లేక వాడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 50 నుంచి 75 మైక్రాన్లకు ప్లాస్టిక్‌ కవర్ల ప్రమాణాలను పెంచిందని తెలిపారు. ఎవరైన 75 మైక్రాన్ల కన్నా తక్కువ ప్రమాణాలున్న ప్లాస్టిక్‌ కవర్లు వాడితే శిక్షార్ణులని హెచ్చరించారు. త్వరలో ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు కోసం ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం కార్పొరేషన్‌తో కలిసి పారిశుధ్య ప్రగతిలో స్వచ్ఛంధంగా పని చేసిన వారికి ప్రొత్సాహక అవార్డులు అందచేశారు. ఇందులో ఎంహెచ్‌వో వెంకటరమణయ్య పాల్గొన్నారు. నెల్లూరు (సిటీ), సెప్టెంబరు 28 : రాబోవు రోజుల్లో ప్లాస్టిక్‌ ముప్పు పొంచి ఉందని కార్పొరేషన్‌ కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌ అన్నారు. ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు అంశంపై మంగళవారం ఆయన కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్‌ కవర్లు అత్యంతం ప్రమాదకరమన్నారు. వాటిల్లో వేడి పదార్థాలు వేయడం వల్ల అందులోని విషకణాలు ఉత్పన్నమై కేన్సర్‌కు దారితీస్తాయన్నారు. ప్రజల్లో అవగాహన లేక వాడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 50 నుంచి 75 మైక్రాన్లకు ప్లాస్టిక్‌ కవర్ల ప్రమాణాలను పెంచిందని తెలిపారు. ఎవరైన 75 మైక్రాన్ల కన్నా తక్కువ ప్రమాణాలున్న ప్లాస్టిక్‌ కవర్లు వాడితే శిక్షార్ణులని హెచ్చరించారు. త్వరలో ప్లాస్టిక్‌ రహిత నెల్లూరు కోసం ఉద్యమం చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం కార్పొరేషన్‌తో కలిసి పారిశుధ్య ప్రగతిలో స్వచ్ఛంధంగా పని చేసిన వారికి ప్రొత్సాహక అవార్డులు అందచేశారు. ఇందులో ఎంహెచ్‌వో వెంకటరమణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T04:49:55+05:30 IST