ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదానం

ABN , First Publish Date - 2021-10-25T06:13:19+05:30 IST

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానికం గా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదానం
శిబిరంలో రక్తదాతలతో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

వెల్లువెత్తిన జనాభిమానం

 301 మంది దాతల రక్తదానం

 హాజరైన మాజీ మంత్రి కాలవ, పరిటాల శ్రీరామ్‌


కణేకల్లు, అక్టోబరు 24: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానికం గా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. దా దాపు 301 మంది రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమానికి మా జీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, బళ్లారి బెస్ట్‌ స్కూలు వైస్‌ చైర్మన కోణంకి తిలక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి రాక సందర్భంగా వందలాది మంది యు వత కణేకల్లులో భారీ ఫ్లెక్సీలు కట్టి పసుపుమయం చేశారు. పూల వర్షంతో, గజమాలలతో నాయకులను అభిమానులు ముంచెత్తారు. దాతలను అతి థులు అభినందించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కణేకల్లు తెలుగు యువత ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని పే ర్కొన్నారు. సమయానికి రక్తం అందక వందలాది మంది ప్రాణాలు విడిచే పరిస్థితుల్లో తెలుగు యువత నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ ఒక బిడ్డకు తల్లి ఏవిధంగా అయితే జన్మను అందించి దేవతగా కొనియాడాబడుతుందో... అదేవిధంగా రక్తం కోసం ఎదురుచూసే వారికి రక్తాన్ని అందిం చే దాతలు దైవంతో సమానమని పేర్కొన్నారు. కణేకల్లులో ఇంత భారీ ఎ త్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని సూచించారు. రా బోయేది టీడీపీ ప్రభుత్వమేనని, మరలా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. అంతకుమునుపు కణేకల్లు క్రాసింగ్‌లో వారికి ఘనస్వాగతం పలికి,  భారీఎత్తున ర్యాలీ చేపట్టారు.


 కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కురుబ నాగరాజు, వరుణ్‌, అనిల్‌, వెంకటేశులు, శివరాజ్‌, షేక్‌ ముజ్జు, టీడీ పీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌, షేక్‌ ఫకృద్దీన, సుదర్శన, వేలూరు మరియప్ప, రాఘవేంద్ర గుప్తా, ఆది, బసవరాజు, సంజీవరాయుడు, చంద్రశేఖ ర్‌ గుప్తా, మాబూసాబ్‌, చాంద్‌ బాషా, ఎంసీ సర్మస్‌, రమేష్‌, శరబనగౌడ్‌, అశోక్‌, రామప్ప, హనుమాపురం సర్పంచ జయరామ్‌చౌదరి, ఎంపీటీసీ న రేంద్ర, మారుతిప్రసాద్‌, యర్రిస్వామి, శేషప్ప, ఆంజనేయులు, రాయదుర్గం కన్వీనర్‌ హనుమంతు, బొమ్మనహాళ్‌ కన్వీనర్‌ బలరామిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, కేశన్న, తిప్పేస్వామి, షేక్‌ హుస్సేన, నాగభూషణం, రాజన్న, గోపాల్‌, పోట్ల రవి, వన్నూరుస్వామి, యర్రిస్వామి రెడ్డి, ఆ నంద్‌ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T06:13:19+05:30 IST