Abn logo
Apr 9 2020 @ 20:50PM

టిక్‌టాక్‌లో లైవ్ చాట్ చేద్దామా: అల్లు శిరీష్

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్‌లలో సెలబ్రిటీలు తమ అభిమానులకు ఏ విధంగా చేరువగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సెలబ్రిటీలందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వారందరూ తమ అభిమానులతో ముచ్చటించేందుకు రోజూ ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. అయితే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్‌ల కంటే కూడా ఎంతో ఫాస్ట్‌గా ప్రజలకు చేరువవుతున్న మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎవరికి వారు వీడియో తీసి, వారే సెలబ్రిటీలుగా ఫీలయ్యే అవకాశం ఈ టిక్ టాక్ కల్పిస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలు ఈ టిక్ టాక్‌పై కూడా కన్నేశారు. దీని ద్వారా కూడా ప్రేక్షకులతో డైరెక్ట్‌గా మమేకమయ్యేందుకు రెడీ అవుతున్నారు. 


తాజాగా అల్లు శిరీష్.. టిక్ టాక్ ద్వారా స్పందిస్తూ.. ఏప్రిల్ 10న సాయంత్రం 5 గంటలకు చాట్ చేసేందుకు సిద్ధమవ్వండి అని పిలుపునిచ్చారు. అందరూ ఇంటి దగ్గర సురక్షితంగా ఉండాలని కోరుకున్న అల్లు శిరీష్ శుక్రవారం లైవ్‌లో చాట్ చేయనున్నానని తెలిపారు.

♬ original sound -bollywood.mirror


Advertisement
Advertisement
Advertisement