Abn logo
May 18 2020 @ 11:02AM

ర‌వితేజ చిత్రంలో మెగా హీరో..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ‘క్రాక్’ సినిమా త‌ర్వాత మూడు సినిమాలు చేయ‌డానికి చేయడానికి సిద్ధమైనట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇందులో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ చేయాల్సిన సినిమా ఒక‌టి. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉంద‌ట‌. ఇర‌వై నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ అయితే స‌రిపోతాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించి ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement