Abn logo
May 31 2020 @ 09:12AM

సాహ‌సానికి మారుపేరు.. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌: చిరంజీవి

తెలుగు చ‌ల‌న చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని విధంగా త‌న‌దైన ముద్ర వేసిన వ్య‌క్తి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌. ఈరోజు(మే 31) ఆయ‌న 77వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంద‌రూ కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా కృష్ణ‌కు బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు. ‘‘కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు,నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్‌స్టార్ కృష్ణ‌గారికి జన్మదినశుభాకాంక్షలు’’ అన్నారు. 


Advertisement
Advertisement
Advertisement