Abn logo
May 21 2020 @ 17:24PM

మోహన్‌లాల్‌కు మెగాస్టార్ బర్త్‌డే విశెష్

మలయాళ సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరొందుతున్న మోహన్‌లాల్ పుట్టినరోజు(మే 21)ను పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలందరూ మోహన్‌లాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కథానాయకుడిగా మెప్పిస్తూ.. అద్భుతాలు సృష్టిస్తున్న మోహన్‌లాల్ 60వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకున్నారు కానీ.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా మోహన్‌లాల్‌కు తన సహచరుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.


‘‘నా ప్రియమైన లాలెట్టన్ మోహన్‌లాల్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి వెర్సటైల్ యాక్టింగ్ లెజెండ్ మరియు సూపర్ స్టార్ ఉన్న కాలంలోనే చిత్ర పరిశ్రమలో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. మీరు ఇలాగే మీ నటనతో అందరిలో స్ఫూర్తినింపుతూ.. సోదరభావాన్ని పంచుతూ.. రాబోయే కాలంలో కూడా ప్రేక్షకులను ఆహ్లాదపరచాలని కోరుకుంటున్నాను..’’ అని తెలుపుతూ మలయాళంలో మోహన్‌లాల్‌కు చిరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement