Abn logo
Apr 7 2020 @ 22:48PM

తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోషియేష‌న్‌‌పై చిరు ప్రశంసలు

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోవాలి అని ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రూ ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో ఉండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్‌ల‌కి సిసిసి ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్షించాల్సిన విష‌యం. అయితే వారంలో ఏ రోజూ సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లోని సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్‌లకి తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోషియేష‌న్ అండ‌గా నిలబడి సుమారు 35 మందికి నెలరోజులకి సరిపడా నిత్యావసర సరుకులను అందించి అండగా నిలిచింది. తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోషియేష‌న్ సహాయ కార్యక్రమాలు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అసోషియేషన్‌పై ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి ఈ అసోషియేషన్‌ను అభినందించారు.


‘‘ఈ విపత్కర పరిస్థితులలో తమ జర్నలిస్ట్స్ కుటుంబాలకి అండగా నిలబడి, వారికి సాధ్యమైనంతగా తోడ్పాటును అందించి.. సోదర స్ఫూర్తిని తెలియజేసిన తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోషియేష‌న్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.Advertisement
Advertisement
Advertisement