Abn logo
May 20 2020 @ 20:08PM

ఇండ‌స్ట్రీ మెగా మీటింగ్‌..!!

కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో ప్ర‌పంచం చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. ప‌లు ప‌రిశ్ర‌మ‌లు స్తంభించాయి. అలాంటి వాటిలో చిత్ర ప‌రిశ్ర‌మ ఒక‌టి. సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ప్ర‌భుత్వాలు ప‌లు రంగాల‌కు స‌డ‌లింపులు ఇస్తున్న త‌రుణంలో చిత్ర ప‌రిశ్ర‌మ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి?  థియేట‌ర్స్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలి? అనే విష‌యాల‌పై రేపు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌ముఖుల‌తో మీటింగ్ ఏర్పాటు చేశార‌ని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి‌. మరి ఇందులో నిజా నిజాలెంత? ఈ మీటింగ్ త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌ముఖుల‌నెవ‌రినైనా సినీ పెద్ద‌లు క‌లుస్తారేమో? చూడాలి.

Advertisement
Advertisement
Advertisement