Abn logo
May 6 2020 @ 21:39PM

స్టార్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌..?

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్ప‌టి అగ్ర ద‌ర్శ‌కులంద‌రితో ప‌నిచేసిన ఈయ‌న‌.. నేటి త‌రం అగ్ర దర్శ‌కులు రాజ‌మౌళి, శంక‌ర్‌ల‌తో ఇంత వ‌ర‌కు ప‌నిచేయ‌లేదు. వీరిద్ద‌రితో చిరు ప‌నిచేయాల‌ని మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుకుంటుంటారు. త్వ‌ర‌లోనే మెగా ఫ్యాన్స్ కోరిక తీరుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని, ప్రారంభ ద‌శ‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement