ఏపీలో ఒకే రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-06-20T16:54:40+05:30 IST

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు..

ఏపీలో ఒకే రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు

అమరావతి: వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేపట్టింది. 45 ఏళ్లు దాటినవారు.. ఐదేళలోపు చిన్నారుల తల్లులకు టీకాలు వేయనున్నారు. ఆదివారం ఒక్క రోజే 10 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాలకు వెళ్లేవారికి కూడా ఇవాళ వ్యాక్సిన్ ఇస్తామని అధికారులు చెప్పారు.


రాష్ట్ర వ్యాప్తంగా  ఇవాళ ఉదయం అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఆరు లక్షలకుపైగా ఒకే రోజు వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. దాన్ని అధిగమించి 8 నుంచి 10 లక్షల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతోంది.

Updated Date - 2021-06-20T16:54:40+05:30 IST