మెగా వ్యాక్సినేషన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-06-21T04:34:59+05:30 IST

జిల్లాలో ఆదివారం రికార్డుస్థాయిలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది. జిల్లాలో 48 వార్డు సచివాలయాలు, 252 గ్రామ సచివాలయాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ చేపట్టారు. 90వేల మందికి వ్యాక్సిన్లు వేయాలని అధికారులు లక్ష్యం విధించగా 89,413 మందికి వైద్యసిబ్బంది టీకాలు వేశారు.

మెగా వ్యాక్సినేషన్‌ విజయవంతం
నరసన్నపేట: కోమర్తిలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

 ఒకేరోజు 89,413 మందికి టీకాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం/నరసన్నపేట/పోలాకి, జూన్‌ 20)

జిల్లాలో ఆదివారం రికార్డుస్థాయిలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది. జిల్లాలో 48 వార్డు సచివాలయాలు, 252 గ్రామ సచివాలయాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ చేపట్టారు. 90వేల మందికి వ్యాక్సిన్లు వేయాలని అధికారులు లక్ష్యం విధించగా 89,413 మందికి వైద్యసిబ్బంది  టీకాలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు సంబంధించి 26,251 మందికి కొవిషీల్డ్‌, 2,240 మందికి కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు వేశారు. అలాగే 45 ఏళ్లు దాటినవారిలో 56,904 మందికి కొవిషీల్డ్‌, 4,018 మందికి కొవాగ్జిన్‌ టీకాలు వేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాల కోసం ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్లడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా సాగింది. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులు, 45 ఏళ్లుపైబడిన వారంతా ఆదివారం ఉదయానికే సచివాలయాలకు చేరుకున్నారు. దీంతో కొన్నిచోట్ల రద్దీ నెలకొంది. శ్రీకాకుళం నగరంలో ప్రజలు వాక్సిన్‌ కోసం గుమిగూడారు. జిల్లాలో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర నోడల్‌ అధికారి ఎన్‌.ఉమాసుందరి,  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌, ఏడీఎంహెచ్‌ఓ జగన్నాథరావు పలు ప్రాంతాల్లో టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.   


 ఇచ్ఛాపురంలో పడిగాపులు

ఇచ్ఛాపురం మునిసిపాలిటీపరిధిలో పురుషోత్తపురం, బెల్లుపడ కాలనీ, పంజావీధి, బాలికోన్నత పాఠశాలలో వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వచ్చిన వారంతా అవస్థలకు గురయ్యారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు  ప్రక్రియను కొనసాగించాలని  ఉన్నతాధికారులు ఆదేశించినా పది గంటల వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. తర్వాత ప్రారం భించిన కొద్దిసేపటికే వ్యాక్సిన్‌ అయిపోయిందని వైద్యసిబ్బంది తెలియజేశారు. శ్రీకాకుళం నుంచి వ్యాక్సిన్‌ వస్తుందని, గంటపాటు వేచి ఉండాలని అధికారులు సూచించారు. దీంతో ప్రజలు నిరీక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వ్యాక్సిన్‌ రావడంతో ప్రక్రియను కొనసాగించారు. పంజావీధి, బాలికల జూనియర్‌ కళాశాలలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను  మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి పరిశీలించారు.  వ్యాక్సిన్‌ తక్కువరావడంతో సాయంత్రం మూడు గంటల వరకు టీకాలు వేశామని కమిషనర్‌ తెలిపారు. 


మారుమూల ప్రాంతాల్లోనూ టీకా : కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

జిల్లాలో మారుమూల ప్రాం తాల్లో ఉన్నవారికీ కరోనా టీకా వేయనున్నామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అన్నారు. ఆదివారం కోమర్తి, నరసన్నపేట, పోలాకి మండలం ఈదులవలసలో చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అర్హులందరికీ టీకా వేయాలని సూచించారు. వైద్యసిబ్బంది గ్రామాలకు వెళ్లి టీకాకు ఆర్హతలున్న వారి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. దశల వారీగా రెండు డోసుల వాక్సిన్‌ వేయించే బాధ్యత వైద్య సిబ్బందిదేనని స్పష్టం చేశారు. అనంతరం పోలాకి సచివాలయాన్ని సందర్శించి రికార్డుల నిర్వహణ సరిగా ఉండా లని ఆదేశించారు. ప్రజలకు చేరువగా సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు ఉండాల న్నారు. ఫీవర్‌ సర్వే ప్రక్రియ రెండో దశ వేగవంతం చేయాలన్నారు. ఆర్‌ఎంపీలను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలని ఆ సంఘ నాయకులు పెద్దిని శ్రీనివాసరావు, నగరపు రమణమూర్తి, మెండ గోవిం దరావు  కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌, మండల ప్రత్యేకాధికారి ఆర్వీ రామన్‌, తహసీ ల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఎంపీడీవోలు జీవీ రవికుమార్‌, ఉరిటి రాధాకృష్ణ, ఈవో మోహన్‌బాబు, పోలాకి డీటీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T04:34:59+05:30 IST