Abn logo
Jan 21 2021 @ 00:37AM

మెగాస్టార్‌ 153 షూటింగ్‌ షురూ

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘లూసిఫర్‌’ ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి నటించే చిత్రం షూటింగ్‌ బుధవారం ఉదయం ఫిల్మ్‌ నగర్‌లోని సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ కార్యాలయంలో మొదలైంది. సురేఖ కొణిదెల సమర్పణలో ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించే ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, దానయ్య, నిరంజన్‌ రెడ్డి, నాగబాబు,  కొరటాల శివ, సత్యానంద్‌, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మన నేటివిటీకి తగ్గట్లుగా మూల కథలో దర్శకుడు మోహన్‌రాజా మార్పులు చేశారు. చిరంజీవిగారికి ఇది మరో బ్లాక్‌ బస్టర్‌ సినిమాగా నిలుస్తుంది’ అని తెలిపారు.


దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ‘మెగాస్టార్‌ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా ఇది. ‘లూసిఫర్‌’కు ఇది పూర్తిస్థాయి రీమేక్‌ కాదు. ఆ కథను తీసుకుని అందులో మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి, రూపొందిస్తున్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి రచన: లక్ష్మీభూపాల్‌, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా, లైన్‌ ప్రొడ్యూసర్‌: వాకాడ అప్పారావు.

Advertisement
Advertisement
Advertisement