Abn logo
Aug 10 2020 @ 18:02PM

అమ్మకోసం వంట చేసిన చిరు.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్లాస్మా డోనర్స్‌ని సన్మానించే కార్యక్రమంలో తన ఇంట్లో పనివాళ్లకు కూడా కరోనా వచ్చిందనే విషయం చెబుతూ.. అందరినీ నవ్వించిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో చిరు అలరించే తీరే వేరు. ఆయన ట్వీట్స్ చూస్తుంటే నిజంగా ఆయన మెగాస్టార్ ఎందుకు అయ్యారో అర్థమవుతుంది. ఎటువంటి సందర్భంతోనైనా ఎంటర్‌టైన్ చేయగల నటుడు చిరంజీవి. తాజాగా ఆయన ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట!’ అంటూ తనకు జన్మనిచ్చిన అమ్మ కోసం, ఆమెకు ఎంతో ఇష్టమైన వంటకాన్ని తన చేతులతో చేసి మరీ రుచి చూపించారు. వాస్తవానికి ఈ వంట వీడియోను ఆదివారం రోజే చిరు షేర్ చేయాల్సింది కానీ, విజయవాడలో జరిగిన విషాద ఘటనతో.. ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదని, వాయిదా వేస్తున్నానని తెలిపారు. ఇక సోమవారం ఆయన అంజనమ్మ కోసం ఆమెకు ఇష్టమైన ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు’ చేసి రుచి చూపించిర వీడియోను చిరు షేర్ చేశారు. 


ఈ వంటకు కావాల్సిన అన్నింటిని చెబుతూ.. ఎంతెంత పరిమాణంలో వేయాలో చూపించిన చిరు, ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు’ చేసి నెటిజన్ల నోరు ఊరించారు. ఇక వంట అంతా అయిన తర్వాత అంజనమ్మకు ఈ వంట నచ్చుతుందో లేదో అని చిరు పడిన టెన్షన్ అయితే.. చెప్పనవసరం లేదు. అంజనమ్మ చాలా బాగుంది అని చెప్పిన తర్వాత చిరు చిన్నపిల్లాడిలా పొందిన ఆనందం చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలుతాయి. అలాగే అంజనమ్మ ప్లేట్‌లో అన్నం కలిపి.. మొదటి ముద్ద చిరుకి తినిపించబోవడం కూడా వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో, ఇలా చిరు ప్రత్యక్షంగా అప్పుడప్పుడు వీడియోల రూపంలో చూపిస్తుండటం చూసి అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చిరుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


Advertisement
Advertisement
Advertisement