Oct 26 2021 @ 13:31PM

‘రంగమార్తాండ’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్..!

‘రంగమార్తాండ’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడు. అయితే ఈ మూవీకి మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఈమూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా ‘రంగమార్తాండ’ సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.